Monday, December 23, 2024

పొదల్లో ఏం చేస్తున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై లవర్స్ దాడి

- Advertisement -
- Advertisement -

కరప: లవర్స్ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురుకి చెందిన మధుసూధనరావు అనే వ్యక్తి గ్రామంలోని రహదారిపై వెళ్తుండగా చీకట్లో ఓ అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం చూశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు.. ఇలా చీకట్లో మాట్లాడకూడదని అమ్మా యితో చెప్పి ఇంటికి వెళ్లిపోమని సూచించాడు.

దీంతో ఆ అబ్బాయి, మధుసూధనరావుపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి సైతం తెలిసిన వారికి ఫోన్ చేయగా సంఘటనాస్థలానికి మరో ఇద్దరు వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News