Sunday, April 27, 2025

చొప్పదండిలో విషాదం.. ప్రేమికులు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం చిత్యలపల్లికి చెందిన అరుణ్ కుమార్(24) ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అదే మండలం భూపాలపట్నానికి చెందిన అలేఖ్య(21)తో స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. అయితే అలేఖ్యకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంభంధాలు చూడటం ప్రారంభించారు. దీంతో తమకు వివాహం కాదని భావించిన ఆ ప్రేమ జంట కరీంనగర్‌లోని స్నేహితుడి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News