- Advertisement -
అమరావతి: ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లోపూడి గ్రామానికి చెందిన లీకుమారి, పశ్చిమగోదావరి జిల్లా ఎర్రవారిగూడెంకు చెందిన అనిల్ కుమార్ గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో ఆ జంటకు అడ్డుచెప్పారు. తాము బతికి ఉన్నంత కాలం ప్రేమ బతకదని తెలిపి ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాల సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -