Monday, December 23, 2024

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి న్యూస్ : ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి జిల్లా బహూపేట సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్వాపూర్ గ్రామానికి చెందిన గణేష్, నలంద కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నలందకు మరో యువకుడితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. గాఢంగా ప్రేమించుకున్నామని.. కలిసి ఉండలేకపోవడంతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు.

ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోవడంతో యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు మృతదేహాలు బహూపేట రైలు పట్టాలపై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలు గణేష్, నలందదిగా గుర్తించారు. మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇద్దరు ప్రేమించుకొని కలిసి ఉండలేకపోతున్నామనే ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News