Sunday, December 22, 2024

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోలేదనే కారణంతో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ ఎస్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన సంజయ్ (25), ఆవాస గ్రామం.. కృష్ణసముద్రం డబుల్ బెడ్రూంలో ఉండే సల్లగండ్ల నాగజ్యోతి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో మెకానిక్‌గా పనిచేస్తుండగా, నాగజ్యోతి సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. వీరి ప్రేమ విషయం ఆమె తండ్రికి తెలిసి పలుమార్లు హెచ్చరించారు. గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ,

ఆరె లతారెడ్డి తన తండ్రికి లేనిపోని మాటలు చెప్పి తమ ఇద్దరి ప్రేమను విడగొట్టాలని చూసారని, అదేవిధంగా అమ్మాయి తరపు వారు సల్లగండ్ల అజయ్, సల్లగండ్ల మల్లయ్య, సల్లగండ్ల శ్రీను, సల్లగండ్ల ఉప్పలయ్య గత కొద్ది రోజుల క్రితం సంజయ్‌తో గొడవ పడ్డారు. ఈ విషయంతో మనస్థాపం చెంది వారిద్దరూ గ్రామ శివారులో కోట రాజేందర్ రెడ్డి వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని నాగజ్యోతి బ్యాగులో సూసైడ్ నోటులో వివరంగా రాసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News