అమరావతి: ప్రేమించినందుకు యువకుడి ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగింది. కొప్పురావురులో విన్నకోట వెంకటేష్(23) అనే వ్యక్తి ప్రైవేటు డెంటల్ ఆస్పత్రిలో కంపౌండర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్ చదువుతున్న బాలికతో ప్రేమలో పడ్డాడు. వెంకటేష్ -యువతి ప్రేమ పెళ్లి చేసుకుందామనే సరికి ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. రెండు కుటుంబాలు పెద్ద మనషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. వెంకటేష్ కొన్నాళ్లుగా గ్రామానికి దూరంగా ఉంటున్నాడు. ఆ యువతితో పలుమార్లు యువకుడు ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అతడిని మట్టుబెట్టాలని బాలిక కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వెంకటేష్‌ను మాట్లాడుకుందామని గ్రామ శివారులోకి రప్పించి కళ్లలో కారంపొడి చల్లి విచక్షణరహితంగా దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రిలో తరలించారు. అప్పటికే యువకుడు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.