Thursday, December 26, 2024

మంచిర్యాల అమ్మాయి..బ్రిటన్ అబ్బాయి..

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల:  ప్రేమకు కులం, మతం, వర్ణమే కాదు దేశాలు, ఖండాలు కూడా అడ్డుకాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. ఆ అబ్బాయి పేరు బెన్ బ్రిటన్‌కు చెందిన వాడు, తల్లిదండ్రులు రోజర్ నిగెల్, జీన్‌లైటౌలర్. అమ్మాయి పేరు సిందూర, తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన కొత్త మహేందర్, సుజాతల కూతురు. అవును వారిద్దరు ఒక్కటయ్యారు. సప్త సముద్రాల ఆవల పుట్టిన ప్రేమ సంద్రాలు దాటి..ఖండాలు దాటి మూడు ముళ్లతో ఒక్కటైంది. పెద్దలు నిర్ణయించిన సుముహూర్తాన హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ మద్య ఒక్కటైంది ఆ జంట. అమ్మాయి అక్షరాల అచ్చ తెలుగమ్మాయి. అబ్బాయి బ్రిటన్ దేశం. యూకేలోని కళాశాలలో పుట్టిన ప్రేమ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా సందడిగా మారి ఆ ఇంట పండుగ వాతావరణాన్ని తెచ్చింది.

మూడు ముళ్లతో ఒక్కటైన మంచిర్యాల అమ్మాయి..బ్రిటన్ అబ్బాయి ముచ్చటే ఇది. ప్రేమకు కులం, మతం, వర్ణం అడ్డుకాదని, దేశాలు, ఖండాలు కూడా అడ్డు కాదని నిరూపించింది ఈ ప్రేమ జంట. బ్రిటన్‌కు చెందిన బెన్, లక్షెట్టిపేటకు చెందిన సిందూరతో జరిగిన వివాహానికి వరుడి తల్లిండ్రులు, దగ్గరి బంధువులు హాజరై నవ దంపతులను దీవించారు. సిందూర యూకేలో ఎంఎస్ చదువుతున్న సమయంలో సహా విద్యార్ధి బెన్ లైటౌలతో పరిచయం ఏర్పడి ఇది ప్రేమగా మారింది. ప్రస్తుతం బెన్ లైటౌలర్ జర్మనిలో, సిందూర యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. తమకు తెలుగు సంప్రదాయం నచ్చిందని, తమ దేశంలో ఇలాంటి వివాహ విధానం లేదని, సిందూర తమ కుటుంబంలో సభ్యురాలు అయినందుకు హ్యాపీగా ఉందని చెబుతున్నారు బెన్ తల్లిదండ్రులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News