Sunday, January 19, 2025

ప్రియురాలి భర్త గొంతుకోసి తగలబెట్టాడు…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ప్రియురాలి భర్తను ప్రియుడు గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని వాజీరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రషీద్, మునిషీద్ధీన్ అనే వ్యక్తులు రామ్‌ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇద్దరు ప్లంబర్ పనులతో పాటు ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవి. ఈ క్రమంలో రషీద్ భార్య మునిషీద్ధీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ప్లాన్‌లో భాగంగా భర్తను చంపాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. రషీద్‌ను మద్యం తాగుదామని మునిషీద్ధీన్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. రషీద్‌కు మద్యం పూటుగా తాగించిన అనంతరం అతడి కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం అతడి గొంతు కోసిన అనంతరం చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. మృతదేహాన్ని పొదల్లో వేసి తగలబెట్టాడు. పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే మునిషీద్ధీన్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News