Monday, December 30, 2024

ప్రియురాలు ఉరేసుకుందని… ప్రియుడు గొంతుకోసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియుడు గొంతుకోసుకొని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రవళిక, రవీందర్ అనే యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రవళిక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసకుంది. ఈ విషయం తెలియగానే ప్రియుడు రవీందర్ కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు. స్థానికులు గమనించి అతడి వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రవళిక మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News