Sunday, December 22, 2024

నదిలో దూకిన ప్రేమజంట…. ప్రియుడి చెంపచెల్లుమనిపించి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ ప్రేమజంట నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లోని గోమతి నదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ ప్రేమజంట నదిలో దూకింది. అక్కడ చేపలు పడుతున్న మత్స్యకారులు వెంటనే అప్రమత్తమై ఇద్దరిని బయటకు తీశారు. ఓ మత్సకారుడు ప్రియుడిని పట్టుకొని చెంపచెల్లుమనిపించాడు. జీవితం ఎంత విలువైందో చెబుతూ మూడు నాలుగు సార్లు చెంప వాయించడంతో ప్రియుడు కంగుతిన్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయి అని తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News