Sunday, April 6, 2025

దుబ్బాకలో ఒకే తాడుకు ఉరేసుకున్న ప్రేమజంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..కుటుంబసభ్యుల కథనం ప్రకారం..దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు.

వీళ్లిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇవాళ భగీరథ్ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను దుబ్బాక లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: లక్ష్మీ బ్యారేజ్ 36 గేట్లు ఎత్తివేత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News