అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది 22వ తేదీకల్లా తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారి, 23న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని సూచించింది. తదుపరి దిశ మార్చుకుని ఉత్తరంగా పయనించి పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి 24న తుఫాన్ గా బలపడే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోసారి దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని సమాచారం. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఈనెల 22 నుంచి 24 వరకు ఒడిసా వైపు వేటకు వెళ్లొదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత కోస్తాలో మేఘాలు ఆవరించనున్నాయి. అక్టోబర్ 23 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమణ ప్రారంభం కానుంది. అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రవేశి స్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -