Friday, January 10, 2025

బంగాళాఖాతంలో అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

Low pressure in Bay of Bengal

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తర బంగాళా ఖాతంలో శనివారం అల్ప పీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశవైపుకి వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి 24 గంటల్లో అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపిలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News