- Advertisement -
హైదరాబాద్: ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమకు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఉత్తర కోస్తాల్లో భారీ నుంచి అసాధారణ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 12 లేదా 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ అధికారులు ప్రకటించారు.
- Advertisement -