Monday, December 23, 2024

15న మరో అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ అండమాన్ సముద్రతీరంలో ఈనెల 13న మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది బలపడే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు అంచనా వేశారు. అదలా ఉండగా మాడస్ ప్రభాంతో రాష్ట్రలో సోమవారం నాడు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. హకీంపేటలో అత్యధికంగా 10.4మి.మి వర్షం కురిసింది. అదిలాబాద్‌లో 6.8,దుండిగల్‌లో 6.7, హైదరాబాద్‌లో 4.5, రామగుండంలో 1మి.మి వర్షం కురిసింది. తూర్పు ఆగ్నేయ ప్రాంతం నుంచి కిందిస్థాయిలో వీస్తున్న చల్లటి గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో రికార్డయిన కనిష్ట ఉష్ణోగ్రతలు మెదక్‌లో 16.8డిగ్రీలు నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 20.5,భద్రాచలంలో 22, దుండిగల్‌లో 20.8, హకీంపేటలో 19.8, హైదరాబాద్‌లో 19.6, హన్మకొండలో 19, ఖమ్మంలో 22.4, మహబూబ్‌నగర్‌లో 21.6, నల్లగొండలో 18, నిజామాబాద్‌లో 21.4, రామగుండంలో 20డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతులు నమోదు అయ్యాయి. రానున్న 48గంటల్లో తెలంగాణ అంతటా ఆకాశం మేఘావృతం అయివుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తూర్పు, అగ్నేయ దిశలనుండి కింది స్థాయిలో శీతల గాలులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News