Wednesday, January 22, 2025

రేపు అసని తుఫానుగా మారనున్న అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

 

Asani
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకున్న అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం(లోప్రెషర్) ఈ రోజు ‘డిప్రెషన్’గా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో సోమవారం తుఫానుగా మారనుంది. ఈ తుఫాను 2000 తర్వాత ఇప్పుడు మళ్లీ ఏర్పడుతోంది. ఈ అల్పపీడనం కనుక తుఫానుగా మారితే దానికి శ్రీలంక పెట్టిన ‘అసని’ పేరుతో చలామణి అవుతుంది. ఈ వ్యవస్థ ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర మయన్మార్, ఆగ్నేయ బంగ్లాదేశ్ తీరాలకు మార్చి 22న చేరుకోవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండి) అంచనా వేసింది. అండమాన్ మీదుగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ‘మార్చిలో ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫానులు చాలా తక్కువ, మార్చి నెలలో మనకు ఇంటెన్స్ సిస్టమ్స్ ఉండవు. తుఫాను గాలి గంటకు 55 నుంచి 75కిమీ. వేగంతో వీచే అవకాశం ఉంది. అండమాన్, నికోబార్ దీవులలో మంగళవారం భారీ వర్షపాతం ఉండనుంది. మత్సకారులు మంగళవారం చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించడమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News