Thursday, December 19, 2024

ఓటింగ్ కు ఆసక్తి చూపని హైదరాబాదీలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

అయితే, హైదరాబాద్ లో మాత్రం ఇప్పటివకు ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైనట్లు చెప్పారు. ఓటు వేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపడం లేదు.. 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. చాలామంది ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపకపోవడంతో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్​, మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News