Monday, March 10, 2025

కొత్త సంవత్సరంలో తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

- Advertisement -
- Advertisement -

నూతన సంవత్సరంలో హోటళ్లు, రెస్టారెంట్‌లను నడుపుతున్న వ్యాపార యజమానులకు ఉపశమనం లభించింది. బుధవారం LPG కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఢిల్లీ, ముంబై సహా నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ల (19 కిలోలు) ధరలను కేంద్ర ప్రభుత్వం 14 రూపాయలు తగ్గించింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ కొత్త ధర రూ.1804గా ఉంది. అయితే, దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల ధర (14.2 కిలోలు) యథాతథంగా రూ.803గా ఉంది.

కాగా, చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయిస్తాయి. ఈ క్రమంలో గత డిసెంబర్, నవంబర్ నెలల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరల పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు డిసెంబర్ లో ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.16.50 పెంచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News