- Advertisement -
పాట్నా : పాట్నా లోని సోనె నదిలో శనివారం మోటార్ బోటు లో వంటగ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కూలీలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. బోటులో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 20 మంది వరకు కూలీలు ఉన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సిలిండర్ పేలినా బోటు మాత్రం మునిగిపోలేదని, ఒడ్డుకు తీసుకురావచ్చని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ చెప్పారు. బోటులో ఎల్‌పిజి సిలిండర్‌ను తీసుకెళ్లడం నేరంగా పేర్కొన్నారు.
- Advertisement -