న్యూఢిల్లీ: సామాన్యుడికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రాయితీ సిలిండర్ పై రూ. 25, వాణిజ్య సిలిండర్ పై రూ.184లను పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేట్లు నేటి నుంచి అమలులోని రానున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటివరకు రూ.746.50గా ఉన్న సిలిండర్ ధర రూ. 771.50కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజీ సిలిండర్ ధర రూ.664 ఉండగా, ఇప్పుడు రూ.719కి చేరింది. కోల్‌కతాలో రూ.745.50, చెన్నైలో రూ.735, వాణిజ్య రాజధాని ముంబైలో రూ.719కి పెరిగింది. ఈ ఏడాదిలో సిలిండర్ ధరలు పెరగడం గమనార్హం. అయితే ఇప్పటికే దేశంలో పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగి వాహనాదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగడంతో కేంద్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
కేంద్రం మరో షాక్.. వంట గ్యాస్ ధరలు పెంపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -