Wednesday, January 22, 2025

పేదలపై గ్యాస్ బండ బాదుడు

- Advertisement -
- Advertisement -

LPG cylinder rate increased by Rs 50

రెండు నెలల్లో మూడుసార్లు పెంచిన చమురు సంస్దలు
తాజాగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 50 పెంపు
ప్రస్తుతం రూ. 1105 కి చేరుకున్న సిలిండర్ ధర
ధరల పెంపుతో కేంద్ర సర్కార్‌పై నగరవాసుల ఆగ్రహం

హైదరాబాద్: గ్రేటర్ ప్రజలపై మరోసారి గ్యాస్‌బండ పిడుగు పడింది. గత రెండు నెలలుగా మూడు సార్లు గ్యాస్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మరోసారి గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచినట్లు చమురు సంస్దలు ప్రకటించాయి. పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ. 1105కి చేరుకుంది. పెరిగిన వెంటనే అమలుల్లోకి వస్తుందని తెలిపాయి. మే నేల నుంచి ఇలా పెరగడం మూడోసారి కాగా గడిచిన ఏడాది కాలంలో వంటగ్యాస్ ధర ఏకంగా రూ. 244కు పెరిగింది. మార్చి 22వ తేదీన సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. మళ్లీ మే 7న మరో రూ. 50 పెరగ్గా, మే 19వ తేదీన రూ. 3.50 పెంచుతూ చమురు సంస్దలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నెల నుంచి మొత్తంగా ఒక్కో సిలిండర్‌పై రూ. 153.50 పెంచాయి. అంతేగాకుండా గతంలో సబ్సిడీ ఇచ్చేంది ఇటీవలే ఉజ్వల యోజన పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ పొందిన వారికే సబ్సిడీ ఇస్తున్నట్లు మిగతా గ్యాస్ కనెక్షన్లకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈప్రకటనతో నగరవాసులకు గ్యాస్ మరింత బారంగా మారింది. దీంతో నగరవాసులు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. భవిష్యత్తులో గ్యాస్‌ధర పరిస్దితి చూస్తూంటే పాత కాలం నాటి కట్టెల పొయ్యి వాడే దుస్దితి కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరలు పెంపుతో పొదుపు జీవితాలు పాటిస్తున్నామని, మళ్లీ గ్యాస్ ధరలు పెరగడంతో నగరంలో జీవించటం కష్టమంటున్నారు. గ్రేటర్ నగరంలో 135 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వాటిలో 28.25లక్షల కనెక్షన్లులు ఉండగా నిత్య 1.10లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల పెంపుతో డొమెస్టిక్ సిలిండర్లను చిరువ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తూ పేదలకు సకాలంలో పంపిణీ చేయకుండా ఏజెన్సీలతో కుట్రలు చేస్తున్నారు.డెలివరీ బాయ్స్ రెండు రోజులకు రావాల్సిన సిలిండర్లను నాలుగు రోజులకు అందజేస్తున్నారు. లబ్దిదారులు ప్రశ్నిస్తే స్టాక్ సరిపడలేదని సమాధానం చెబుతూ సిలిండర్లను పక్కదారి పట్టినట్లు విమర్శలు వచ్చాయి. సిలిండర్ల అక్రమాలపై స్దానిక పౌరసరఫరాల అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్దానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News