Tuesday, April 8, 2025

పెరిగిన సిలిండర్ ధర.. వినియోగదారులపై పెను భారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి వినియోగదారులపై గ్యాస్ భారాన్ని పెంచేసింది. మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గత వారంలో వాణిజ్య సిలిండర్ ధరను రూ.41కి పెంచిన కేంద్రం ఇప్పుడు గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్‌పై రూ.50 పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల మంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడించారు.

అయితే ఈ పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే దీంతో పాటు సోమవారం పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పెంపు భారం వినియోగదారులపై పడబోదని.. చమురు కంపెనీలే దాన్నీ భరిస్తాయని స్పష్టం చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News