Thursday, January 23, 2025

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

- Advertisement -
- Advertisement -

దేశంలో మరోసారి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లపై రూ.101 పెంచాయి. తాజాగా పెంచిన ధరలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1833కు చేరుకుంది. ఇక, కోల్‌కతాలో రూ.1943, ముంబైలో రూ.1785, చెన్నైలో రూ.1999కు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News