వచ్చే ఏడాదినుంచి అమలు
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లలో తూకాల్లో మోసాలకు క్యూఆర్ కోడ్‌తో చెక్ పడనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్యాస్ కంపెనీలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. సిలిండర్లలో గ్యాస్ ఒకటి రెండు కేజిలు తక్కువగా ఉంటుందని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక డెలివరీ సకాలంలో జరగటం లేదని వినియోగదారుల నుంచి తరుచుగా వస్తున్న ఫిర్యాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ అమలు చేస్తామని, మెటల్ స్టిక్కరను సిలిండర్లకు అతికించనున్నట్టు కేంద్ర చమురు వ్యవహారాలశాఖ మంత్రి హర్ధీప్‌సింగ్ పూరీ వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా స్మార్ట్ ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌కున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏ ఏజెన్సీ నుంచి డెలివరీ అవుంతుంది, సిలిండర్‌లో గ్యాస్‌ను ఎక్కడ ఫిల్ చేశారు, గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా, సిలిండర్‌లో ఎన్ని కిలోల గ్యాస్ నింపివుంది, ఎప్పుడు , ఏ తేదీన డెలివరి అవుంతుంది తదితర విషయాలు క్యూఆర్ కోడ్ సహాయంతో తెలుసుకోవచ్చు.
క్యూఆర్ కోడ్‌ను సిలిండర్లకు అమర్చడం ద్వారా దొంగిలిస్తున్న గ్యాస్‌తోపాటు సిలిండర్ భద్రత , ఇతర గ్యాస్ ఏజెన్సీలు , డెలివరీ వంటి విషయాల సమాచారం వినియోగదారులకు అందించవచ్చని కేంద్రమంత్రి హార్డీప్‌సింగ్ పూరి వివరించారు. ఈ కొత్త విధానం మూడు నెలల్లో అమల్లోకి రానుంది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఉన్న సిలిండర్లతోపాటు కొత్త సిలిడర్లకు కూడా మెటల్ స్టిక్కర్ అమర్చనున్నట్టు వెల్లడించారు. ఈ నూతన విధానం అమల్లోకి వచ్చాక వినియోగదారులు ఎదుర్కొంటున్న సమసలకు తెరపడతుందని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పేర్కొన్నారు.