Thursday, January 23, 2025

ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆరోగ్యశ్రీలో రూ.5లక్షల వరకు వైద్యం ఉచితంగా అందిస్తామని, రూ.5వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, తమ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లిస్తామని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో తలపెట్టిన పాదయాత్ర పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పులలో మొదలుపెట్టారు.

అక్కడి నుంచి ఎర్రటి ఎండలో 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ఊరూరా ప్రజలను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకొని సాయంత్రం పాలకుర్తికి చేరుకున్నారు. పాలకుర్తిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినోళ్లకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని అన్నారు. దేవరుప్పులలో ప్రారంభమైన ఈ పాదయాత్రలో భాగంగా ఆయన ధర్మాపురంలో అర్ధంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సందర్శించి నిరుద్యోగ యువతీ యువకులతో మాట్లాడారు.

కాగా బిఆర్‌ఎస్ పాలనలో అవినీతి ఆకాశాన్ని అంటుకుందని, గ్రామాల్లో సైతం ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని, ఈ అంశాలపై పోరాడాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి, రామరాజుపల్లి అధ్యక్షులు పురుషోత్తం కృష్ణ, సింగరాజుపల్లి అధ్యక్షులు కొండ మల్లారెడ్డి, నీర్మాల అధ్యక్షులు చింత రవిందర్‌రెడ్డి, పెద్దమడూరు అధ్యక్షులు పురుషోత్తం, బంజర నాయకులు ధరావత్ నరేందర్, ధరావత్ చందర్, సింగరాజుపల్లి నాయకులు నల్ల యాదగిరి, తాళ్లపల్లి వేణు తదితరులు వినతిపత్రం అందజేశారు. ఈ పాదయాత్రలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎఐసిసి సీనియర్ నాయకులు మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ లక్ష్మీనారాయణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News