- Advertisement -
కోల్‌కతా: ఇండియా ప్రతిపక్ష కూటమి ప్రభావం కారణంగానే మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలండర్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటివరకు ఇండియా కూటమి గత రెండు నెలల్లో రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించింది. ఈ రోజు వంటగ్యాస్ ధరలు రూ.200 మేర తగ్గాయి. యే హై ఇండియాకా దమ్(ఇదీ ఇండియా శక్తి) అని మమతా బెనర్జీ ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కాగా వంటగ్యాస్ ధరలను తగ్గించడం ఎన్నికల స్టంట్‌గా తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అభివర్ణించారు.
- Advertisement -