- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం వంట గ్యాస్(ఎల్‌పిజి) ధరను సిలిండర్‌కు రూ. 3.50 పెంచింది. ఈ నెలలో ఎల్‌పిజి ధరను పెంచడం ఇది రెండవసారి. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ రహిత 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 999.50 నుంచి ఇప్పుడు రూ. 1,003కు పెరిగినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటెయిల్ సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. గత రెండు నెలల్లో ఎల్‌పిజి సిలిండర్ ధర పెరగడం ఇది మూడవసారి. మార్చి 22న సిలిండర్‌పై రూ. 50 పెరగగా మే 7న రెండవసారి మరో రూ. 50 పెరిగింది. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సిలిండర్‌పై మొత్తం రూ. 193.50 వడ్డన జరిగింది. కాగా..వరుసగా 43 రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. మార్చి 22వ తేదీ తర్వాత వరుసగా 16 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 10 వరకు పెరిగాయి.
- Advertisement -