Friday, December 20, 2024

జైపూర్‌ అజ్మీర్ హైవేలో రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్‌అజ్మీర్ హైవేలో శుక్రవారం ఓ ఎల్‌పిజి ట్యాంకర్ , మరో ట్రక్కును ఢీకొనగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ రోడ్డు ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది చనిపోగా, 35 మందికి గాయాలయ్యాయి. ఇంకా అక్కడ దాదాపు 40 వాహనాలు తగులబడ్డాయి.గాయపడిన వారిని జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ హాస్పిటల్‌కు తరలించారు.గాయపడిన 35 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్ తెలిపారు. జైపూర్ పోలీస్ కమిషనర్ బిజూ జార్జ్ జోసఫ్ ఇతర డిపార్ట్‌మెంట్ అధికారులతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్యాంకర్, ట్రక్కును ఢీకొన్నప్పుడు ఎల్‌పిజి ట్యాంకర్ ఔట్‌లెట్ నాజిల్ ధ్వంసమై, గ్యాస్ లీకయిందని, తద్వారా మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఓ పాఠశాల ముందు తెల్లవారు జామున 5.45 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పటికి ఇంకా చీకటి ఉంది. గాయపడిన వారిని 25 అంబులెన్స్‌లో ఎస్‌ఎంఎస్ హాస్పిటల్‌కు తరలించినట్లు, ప్రమాదంలో ఎనిమిది చనిపోయినట్లు ఎస్‌ఎంఎస్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ దీపక్ మహేశ్వరి తెలిపారు.

రాజస్థాన్ ప్రభుత్వం చనిపోయినవారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బాధను వ్యక్తం చేశారు. కాగా చనిపోయిన వారి సంబంధీకులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ పోస్ట్ పెట్టారు.
ముఖ్యమంత్రి శర్మ, ఖింసర్ ప్రమాద వార్త తెలియగానే హాస్పిటల్ కు వెళ్లి అడ్మినిస్ట్రేటర్లు , డాక్టర్లతో మాట్లాడారు. తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైరవ రాష్ట్ర హోం మంత్రి జవహర్ సింగ్ బెధం కూడా ఘటనాస్థలికి చేరుకుని వివరాలు కనుక్కున్నారు. ఈ ఘటనలో హైవేలో ఉన్న పైప్ ఫ్యాక్టరీ ధ్వంసం అయింది. అగ్నిమాపక దళం, అంబులెన్సులు అక్కడ ఉన్నప్పటికీ ఘటనాస్థలికి సకాలంలో చేరుకోడానికి ఇబ్బంది ఏర్పడింది. కాగా జైపూర్ పోలీసులు సమాచారం కోసం హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు 9166347551, 8764688431, 7300363636 ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News