Tuesday, April 1, 2025

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు నేడు, రేపు కూడా ఫీజులను చెల్లించవచ్చు

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును చెల్లించిన 3,25,538 మంది దరఖాస్తుదారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు నేడు, రేపు కూడా ఫీజులను చెల్లించవచ్చని పురపాలక శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజుల పాటు (ఈనెల 30, 31వ తేదీన) ఎలాంటి సెలవుదినాలు లేవని దరఖాస్తుదారులు చెల్లింపులు చేసుకోవచ్చని పురపాలక శాఖ పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపునకు ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశం ఇచ్చింది.

ఈ లోపు చెల్లించిన వారికి రాయితీని అందిస్తోంది. ఈ నెల 30 వ తేదీన ఉగాది, 31 వ తేదీన రంజాన్ పండుగల దృష్ట్యా ప్రభుత్వం ఇది వరకే సెలవులను ప్రకటించింది. ఫీజు చెల్లింపు తుది గడువు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నందున ప్రజల సౌలభ్యం కోసం ఈ రెండు సెలవుదినాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాయితీతో లే ఔట్ ఫీజులు చెల్లించి తమ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉంటాయి

ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులకు ఈనెల 31వ తేదీ చివరిరోజు కావడం, ఆరోజు రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఈనెల 31వ తేదీన పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

20,00,493 మందికి నోటీసులు

2020లో ప్రభుత్వానికి 25,67,107 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా దానికి సంబంధించి 20,00,493 మందికి ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నెల 28వ తేదీ నాటికి 3,25,538 మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News