Wednesday, January 15, 2025

మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనేక కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ ఆర్ ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల మేరకు భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావివ్వకూడదని అన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పరిష్కారం నోచుకోని దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్ల క్రమబద్దీకరణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆమోదించబడిన లేఅవుట్ యజమానులకు ఇంటి నిర్మాణం అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి సాయపడుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News