Monday, December 23, 2024

అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నలోక్ సభ స్పీకర్ !

- Advertisement -
- Advertisement -

All party meeting by LS speaker

ఈ రోజు సాయంత్రం పార్లమెంటులో సమావేశం జరగనుంది.

న్యూఢిల్లీ:  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం పార్లమెంటులో జరగనున్న ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సెషన్‌లో చేపట్టాల్సిన అంశాలు, వివిధ బిల్లులపై  కేటాయించిన సమయంపై చర్చించనున్నారు.

ఇటీవల జారీ చేసిన అన్‌పార్లమెంటరీ పదాల జాబితా వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు రావచ్చు. ప్రతి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు స్పీకర్ సాంప్రదాయికంగా ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆరంభం కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News