Thursday, January 23, 2025

సమరోత్సాహంతో లక్నో

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్‌తో ఢీ
లక్నో: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన లక్నో ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక కిందటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. పంజాబ్‌పై 199 పరుగుల భారీ స్కోరును సాధించినా గుజరాత్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమి గుజరాత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే లక్నోపై గెలిచి మళ్లీ పూర్వవైభవం సాధించాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. వృద్ధిమాన్ సాహా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, అజ్మతులా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. గిల్, విలియమ్సన్, సుదర్శన్ తదితరులు చెలరేగితే గుజరాత్‌కు ఈసారి కూడా భారీ స్కోరు ఖాయం. ఇక రషీద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, అజ్ముతుల్లా, నూర్ అహ్మద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది.

ఫేవరెట్‌గా బరిలోకి..

మరోవైపు లక్నో జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. క్వింటర్ డికాక్, కెప్టెన్ రాహుల్, దేవ్‌దుత్ పడిక్కల్, నికోలస్ పూరన్, స్టోయినిస్, కృనాల్ పాండ్య తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. పూరన్, డికాక్ ఫామ్‌లో ఉండడం జట్టుకు ఊరట కలిగించే అంశమే. అంతేగాక మయాంక్ యాదవ్, నవీనుల్ హక్, కృనాల్, రవి బిష్ణోయ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే. దీనికి తోడు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం లక్నోకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News