Wednesday, April 2, 2025

హోరాహోరీ ఖాయం

- Advertisement -
- Advertisement -

నేడు లక్నోతో పంజాబ్ పోరు

లక్నో: ఐపిఎల్ సీజన్18లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జాయింట్స్ తలపడనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలుపొందిన పంజాబ్ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటపాలైన లక్నో రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆత్మ విశ్వాసంతో ఈ పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే సొంత మైదానంలో ఆడుతుండడం లక్నొకు హోం గ్రౌండ్ కావడంతో కలిసివచ్చే అంశంగా చెప్పొచ్చు.

సూపర్ ఫామ్‌లో లక్నో..

లక్నో జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. లక్నో గత మ్యాచ్‌లో 192 లక్షాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊడ్చేసి సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. మిఛెల్ మార్ష్ వరుసగా ఆర్ధ సెంచరీలతో చెలరేగుతున్నాడు. లక్నో విజయంలో కీలక భూమిక పోషించాడు. అదేజోరును పంజాబ్‌పై ఆడితే లక్నో విజయం సులువనే చెప్పొచ్చు. ఇక మరో యువ బ్యాటర్ కరీబియన్ ఆటగాడు నికోలన్ పూరన్ సయితం బ్యాట్‌తో చెలరేగుతుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై 75 పరుగులు చేసి జట్టు గెలుపు కోసం పోరాడు.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లో 70 పరుగలు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించాడు పూరన్. ఈ మ్యాచ్‌లోనూ పూరనే కీలకంగా మారాడు. వీరికి తోడు మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. ఆయూష్ బడోని, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్ తదితరులతో లక్నో చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..

పంజాబ్‌లోనూ పించ్ హిట్టర్లు, గేమ్‌ఛేంజర్లు ఉన్నారు. అటు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో యువ బ్యాటర్ ఫ్రియాన్ష్ ఆర్య 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ తక్కువ స్కోరుకే ఔటైనా ప్రియాన్ష్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఈ జోడీ రాణిస్తే మరోసారి భారీ స్కోరు చేయడం ఖాయమనే చెప్పొచ్చు. మిడిలార్డర్‌లో శశాంక్ సింగ్ ప్రమాదకరంగా మారాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. జోష్ ఇంగ్లిస్, మాక్స్‌వెల్, స్టోయినిస్, మార్కొ జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, ఫెర్గూసన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ చెలరేగినా పంజాబ్ విజయాన్ని ఎవరూ ఆపలేరు.

శ్రేయస్‌పైనే అందరి దృష్టి

మరోవైపు ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పైనే నిలిచింది. కిందటి సీజన్‌లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ట్రోఫీ సాధించి పెట్టిన అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం రిటేన్ చేసుకోలేదు. అయితే మెగా వేలం పాటలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రికార్డు ధరకు శ్రేయస్‌ను దక్కించుకుంది. అనుకున్నట్టే శ్రేయస్‌కే సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతని కెప్టెన్సీలో పంజాబ్ ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. అయితే శ్రేయాస్ వారి నమ్మకాన్ని నిలబెట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తొలి మ్యాచ్‌లోనే 97 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ కూడా జట్టును విజయపథంలో నడిపించాడు. దీంతో గత మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తుచేసింది పంజాబ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News