- Advertisement -
LSG vs PBKS: ఐపిఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ మార్ష్ డకౌట్ గా వెనుదిరిగగా..మరో ఓపెనర్ మార్‌క్రమ్ (28; 18 బంతుల్లో) ధనాధన్ బ్యాటింగ్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా కేవలం 2 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ప్రస్తుతం లక్నో జట్టు 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో ఆయూష్ బదోని(10), పూరన్(17)లు ఉన్నారు.
- Advertisement -