Thursday, January 23, 2025

LSG vs RCB: చివర్లో చెలరేగిన పూరన్.. బెంగళూరు ముందు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్(81) అర్థక శతకంతో మెరిశాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్(20), స్టోయినిస్(24)లు ఉన్నంతసేపు దూకుడు బ్యాటింగ్ చేశారు.

చివర్లలో నికోలస్ పూరన్(40 నాటౌట్) భారీ సిక్సులతో మెరుపులు మెరిపించాడు. దీంతో బెంగళూరు ముందు లక్నో 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. కాగా, బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్ వెల్ రెండు వికెట్లు పడగొట్టగా..తోప్లే, యష్ దయాల్, సిరాజ్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News