Thursday, January 23, 2025

స్టోయినిస్ హీరోచిత శతకం చెన్నైకు లక్నో షాక్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబె 27 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 66 పరుగులు సాధించాడు.

దీంతో చెన్నై భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నోను మార్కస్ స్టోయినిస్ చిరస్మరణీయ శతకంతో ఆదుకున్నాడు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (0), కెఎల్ రాహుల్‌లు (16) విఫలమయ్యారు. అయితే అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టోయినిస్ 63 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి నికోలస్ పూరన్ 15 బంతుల్లో (34), దీపక్ హుడా ఆరు బంతుల్లో 17 (నాటౌట్) సహకారం అందించారు. దీంతో లక్నో మరో మూడు బంతులు మిగిలివుండగానే అద్భుత విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News