Sunday, April 13, 2025

గుజరాత్‌తో మ్యాచ్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ.. టేబుల్‌ టాప్‌లో ఉన్న గుజరాత్ జెయింట్స్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. ఇక టోర్నమెంట్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో విజయం సాధించిన లక్నోకు ఈ మ్యాచ్‌లో విజయం కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ జట్టులోకి రాగా.. గుజరాత్ జట్టులో కుల్వంత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News