Monday, January 20, 2025

ముగ్గురిని కాపాడి.. ఎనిమిదేళ్ళు కోమాలో ఉండి..!

- Advertisement -
- Advertisement -

మృత్యువుతో పోరాడి ఆ వీర జవాను అలసిపోయాడు. ఇక పోరాడలేనంటూ లొంగిపోయి, అమరుడయ్యాడు. లెఫ్టినెంట్ కల్నల్ కరణ్ బీర్ సింగ్ నాట్ శనివారం జలంధర్ లోని మిలటరీ ఆస్పత్రిలో కన్నుమూశారు.

2015లో జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారాలో లెఫ్టినెంట్ కల్నల్ కరణ్ బీర్ బృందానికి, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎన్ కౌంటర్ జరిగింది. తన సహచరులు ముగ్గురిని కాపాడిన కరణ్ బీర్.. ఒక ఉగ్రవాది తూటాకు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన దవడలోంచి బులెట్ దూసుకుపోయింది. అయినా కరణ్ బీర్ వెనుదిరగలేదు. ఆ ఉగ్రవాదిని మట్టుపెట్టాకే, నేలకొరిగాడు. ఇదే ఎన్ కౌంటర్లో 41 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండెంట్ కల్నల్ సంతోశ్ మహాడిక్ మరణించారు. కరణ్ బీర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స జరుగుతుండగా కరణ్ బీర్ కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచీ ఆయన కోమాలోనే ఉన్నారు. కరణ్ బీర్ కు భారత ప్రభుత్వం 2016 రిపబ్లిక్ డే నాడు సేన పతకాన్ని ప్రదానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News