Monday, December 23, 2024

అధికార లాంఛనాలతో కల్నల్ వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

బొమ్మలరామారం: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోర ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మృతి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి స్వగ్రామంలో అంత్యక్రియలు శనివారం అశ్రు నయనాల మధ్య ఆర్మీ అధికారుల అధికారిక లాంఛనాలతో ఘనంగా పూర్తయ్యాయి. దేశ సేవలో అసువులు బాసిన దేశ సైనికుడికి తుది వీడ్కోలు పలికేందుకు మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఉప్పల వినయ్‌భానురెడ్డి మృతిచెందగా ఆర్మీ అధికారుల నిబంధనల ప్రకారం మృతదేహానికి సంబంధించిన శాఖాపరమైన చర్యలు పూర్తి చేశారు.

శుక్రవారం రాత్రి ప్రస్తుతం వినయ్‌భాను రెడ్డి నివాసం ఉంటున్న హైదరాబాదులోని మల్కాజిగిరి నివాసానికి పార్థివ దేహం చేరుకుంది, ప్రజల సందర్శనార్థం శనివారం తెల్లవారుజాము వరకు ఉంచారు. శనివారం ఉదయం గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ,రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరిన వినయ్ భానురెడ్డి మృతదేహాన్ని బొమ్మలరామారం మండలంలోని రంగాపురం చెక్‌పోస్ట్ నుంచి బొమ్మలరామారంలోని అతని స్వగృహం వరకు వేలాదిమంది యువకుల బైక్ ర్యాలీతో చేరుకుంది. వినయ్‌భాను రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రెండు గంటల పాటు ఉంచి, అనంతరం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల్ల జగదీశ్వర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి,

ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాచకొండ సిపి పిఎస్ చౌహన్ యాదాద్రి భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర ప్రతి ఒక్కరు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వినయ్ పార్థివ దేహం ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది చివరి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానుల సమక్షంలో ఆర్మీ అధికారిక లాంఛనాలతో తండ్రి ఉప్పల నరసింహారెడ్డి, వినయ్ భార్య స్పందన పిల్లలు హిందూ సంప్రదాయం ప్రకారం చితికి నిప్పంటించడంతో మధ్య లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు ముగిసాయి. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News