Sunday, December 22, 2024

నింగిలోనూ ఎల్ &టి విఖ్యాతి

- Advertisement -
- Advertisement -

భారతదేశపు అతి పెద్ద ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ టౌబ్రో (ఎల్ అండ్‌టి) నిర్మాణ ప్రాజెక్టులు విస్తృతం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు విస్తరించుకునే క్రమంలో ఇప్పుడు తరువాతి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) కాంట్రాక్టు పొందేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలకు ఐదు దశాబ్దాలకు పైగా కీలక ఛోదక నిర్మాణరంగ బాధ్యతల్లో ఎల్ అండ్ టి నిలిచింది. ఇప్పుడు స్పేస్ స్టేషన్ నిర్మాణంలో నాసా స్థానంలో ఎల్ అండ్ టి దూసుకురానుందని వెల్లడైంది.

స్పేస్ వాణిజ్య కార్యక్రమాలను చేపట్టిన జెఫ్ బెజోకు చెందిన బ్లూ ఒరిజిన్ అధికార ప్రతినిధులతో ఇటీవలే ఎల్ అండ్ టి చర్చలు జరిపింది. ఆర్బిటల్ లాంచ్, స్పేస్ సొల్యూషన్స్‌పై జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు తాము అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో ప్రాజెక్టుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంస్థ ఉపాధ్యక్షులు వికాస్ ఖితా తెలిపారు. ఇంతకు ముందు ఎల్ అండ్ టి ఇస్రోకు చెందిన ప్రతి ప్రాజెక్టుకు అవసరం అయిన హార్డ్‌వేర్ అందిస్తూ వచ్చింది. వీటిలో చంద్రయాన్, గగన్‌యాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ వంటివి అనేకం ఉన్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News