- Advertisement -
న్యూఢిల్లీ : ఖాదీవిలేజి ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) ఛైర్మన్‌గా తానున్నప్పుడు రూ.1400 కోట్ల పాతనోట్ల కరెన్సీ స్కామ్ జరిగిందని ఆరోపించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సోమవారం లీగల్ నోటీసులు పంపారు. ఇవి బూటకపు, అవమానకర ఆరోపణలని ఈ నోటీసు అందుకున్న 48 గంటల్లోనే నిబంధనలకు కట్టుబడి పత్రికా ప్రకటన చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువునష్టం దావాను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, సంజయ్‌సింగ్, జాస్మిన్ షాలకు ఈ నోటీసులు వెళ్లాయి. పరువు నష్టం కలిగించే హానికరమైన, నిరాధారమైన, తప్పుడు ప్రకటనలను వ్యాప్తి చేయడం మానుకోవాలని సూచించారు.
- Advertisement -