Friday, November 22, 2024

ఢిల్లీ సిఎం ఆతిశీకి ఎల్‌జి ప్రశంస

- Advertisement -
- Advertisement -

కేజ్రీ కన్నా ‘వెయ్యి రెట్లు మెరుగు’ అన్న ఎల్‌జి

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నుంచి శుక్రవారం అరుదైన ప్రశంసలు లభించాయి. ఆతిశీ తన ముందు ముఖ్యమంత్రిగా ఉన్న అర్వింద్ కేజ్రీవాల్ కన్నా‘వెయ్యి రెట్లు మెరుగు’ అని ఎల్‌జి సక్సేనా శ్లాఘించారు. ఢిల్లీలో ఇందిరా గాంధీ ఢిల్లీ మహిళల సాంకేతిక విశ్వవిద్యాలయం ఏడవ స్నాతకోత్సవంలో సక్సేనా ప్రసంగిస్తూ, ‘ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక మహిళ అయినందుకు ఈరోజు నాకు ఆనందంగా ఉన్నది. తనకు ముందు ఉన్న నేత కన్నా ఆమె వెయ్యి రెట్లు మెరుగు అని దృఢనమ్మకంతో చెప్పగలను’ అని అన్నారు. ఎల్‌జి సక్సేనా ఈ వ్యాఖ్య చేస్తూ స్నాతకోత్సవానికి హాజరైన ఆతిశీ వైపు ఒకసారి చూసి, విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థినులను ఉద్దేశించి సక్సేనా మాట్లాడుతూ, ‘మీరు ముందుకు సాగుతుంటే, మీకు నాలుగు మార్గదర్శక స్టార్లు ఉంటాయి. మొదటిది మీ పట్ల మీ బాధ్యత, రెండవది మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత, మూడవది సమాజం, జాతి నిర్మాణం పట్ల బాధ్యత’ అని చెప్పారు. ‘లింగ వివక్షను ఛేదించిన. అన్ని రంగాల్లో ఇతరులతో సమానంగా నిలిచిన మహిళలుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం నాలుగవ బాధ్యత’ అని సక్సేనా పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో కేజ్రీవాల్ తన రాజీనామా సమర్పించిన తరువాత పాలన, అధికార యంత్రాంగంపై ఆధిపత్యం సహా పలు అంశాలపై ఆప్, బిజెపి ఘర్షణ పడసాగాయి. తాను ఎదుర్కొన్న అవినీతి ఆరోపణల దృష్టా ప్రజల నుంచి ‘నిజాయతీ సర్టిఫికేట్’ కోరతానని కేజ్రీవాల్ ఆ సమయంలో స్పష్టం చేశారు. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News