అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద వారం రోజుల పాటు సంగీత కార్యక్రమం
జూన్ 21 నుంచి 25వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు
ఐదు మెట్రో స్టేషన్ల వద్ద 100 కళాకారులలు తమ ప్రదర్శనలివ్వనున్నారు.
హైదరాబాద్: అంతర్జాతీయ సంగీత దినాన్ని వేడుక చేస్తూ ఎల్ అండ్ టీ మెట్రోరైల్ విన్నూత కార్యక్రమాలకు తెర తీసింది. గోతె జెంత్రం హైదరాబాద్, ఉత్కర్ష్ స్మాల్ పైనాన్స్ బ్యాంక్‌తో కలిసి మెడ్లీ శీర్షికన బుస్కింగ్ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కళలు, సంస్కృతిని వేడుక చేసేందుకు మెట్రోరైల్ అంకితం చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమమిది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జయేష్‌రంజన్ హాజరైన ప్రారంభించారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈకార్యక్రమంలో ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్‌ఎల్ ఎండీసీఈవో కెవీబీ రెడ్డి, గోతె జెంత్రం డైరెక్టర్ అమితా దేశాయ్‌తో పాటుగా ఉత్కర్ష్ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈసందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ మెట్రోమెడ్లీ కార్యక్రమం ప్రారంబిస్తుంటం పట్ల సంతోషగా ఉందని, దీనిలో భాగంగా గోతె- జెంత్రం ఐదు మెట్రో స్టేషన్‌లలో బస్కింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతుంది. ఈకార్యక్రమాలు మెట్రో ప్రయాణీకులకు మరింత ఆహ్లాదం కలిగించనున్నాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.అనంతరం హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి ప్రసంగిస్తూ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని సంగీతం అందిస్తుంది. అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని వేడుక చేస్తూ ఈకార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది.దీనిద్వారా కళలు, సంస్కృతిని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కెవీబీరెడ్డి మాట్లాడుతూ నగరవాసులు ఈ ఆహ్లాదకరమైన సంగీత వారోత్సవాన్ని అస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జూన్ 21వ తేదీ నుంచి 25వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఐదు మెట్రో స్టేషన్లలో 100 కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 26వ తేదీన నెక్ట్ ప్రీమియం మాల్ ఎర్రమంజిల్ వద్ద సంగీత వేడుకలు ముగిస్తున్నట్లు చెప్పారు.