Wednesday, January 22, 2025

డిజిటల్ చెల్లింపుల ఆధారిత వాట్సాప్ టిక్కెటింగ్ సదుపాయం ప్రారంభించిన మెట్రోరైల్

- Advertisement -
- Advertisement -

L&T Metro Rail launches WhatsApp eTicketing facility

మన తెలంగాణ, హైదరాబాద్ : డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఉండటో పాటుగా హరిత విధానంలో ప్రయాణాలను ప్రోత్సహిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ దేశంలో మొట్టమొదటిసారిగా సమగ్రమైన డిజిటల్ చెల్లింపు ఆధారిత మెట్రో టిక్కెట్ బుకింగ్ సేవలను వాటాప్స్ ఈటిక్కెటింగ్ సదుపాయంతో ప్రారంభించింది. దీనికోసం తమ డెలివరీ భాగస్వామి, దేశంలో విజయవంతమైన ఫిన్‌టెక్ వేదిక బిల్ ఈజీతో భాగస్వామ్యం చేసుకుంది. గత కొద్ది నెలలుగా పలుమార్లు పరీక్షలను జరిపిన తరువాత హైదరాబాద్ మెట్రో రైల్ ఈనూతన డిజిటల్ టిక్కెట్ బుకింగ్‌ను బిల్ ఈజీ, ఏఎఫ్‌సీ భాగస్వామి షెలినోఫోగ్లోబ్లాస్గ్ సింగపూర్ భాగస్వామ్యం చేసుకుని వాట్సాప్ ద్వారా ప్రారంభించింది.

దీని ద్వారా ప్రతి రోజు మెట్రోలో ప్రయాణించే వారు అత్యంత సౌకర్యవంతంగా ఈ టిక్కెట్‌ను తమ సొంత వాట్సాప్ నెంబర్‌పై పొందవచ్చు. ఈసందర్బంగా ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ డిజిటలీకరణ శక్తిని హైదరాబాద్ మెట్రో రైల్ నమ్ముతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ టిక్కెటింగ్ సేవలను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.

ఇది మాప్రయాణికులల అనుభవాలను వృద్ది చేయనుంది అన్నారు. బిల్‌ఈజీ ఫౌండర్ ఎండీ ఆకాష్ దిలీప్ పాటిల్ వివరిస్తూ కనెక్టడ్ ప్యూచర్ కోసం ఎన్‌సీఎంసీ ప్రోటోకాల్స్‌తో పాటుగా సౌకర్యం, సమర్దలతో కూడిన డిజిటల్ అనుభవాలను అందించడానికి మాటీమ్ కట్టుబడి ఉందన్నారు. దేశంలో రవాణా వ్యవస్దను డిజిటలీకరించడానికి మాప్రయత్నాలను కొనసాగించనున్నామన్నారు. వాట్సాప్ ద్వారా దేశంలో ఆన్‌లైన్ టిక్కెట్‌ను మొట్టమొదటిసారిగా హెచ్‌ఎంఆర్, బిల్‌ఈజీలు సాధ్యం చేశాయి. బిల్‌ఈజీ క్యుఆర్ వినియోగించి ఈమెట్రో టిక్కెట్లను పొందవచ్చు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News