Wednesday, November 6, 2024

ఎల్‌టిటిఇ ప్రభాకరన్ బతికే ఉన్నారట !

- Advertisement -
- Advertisement -

కొలంబో: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టిటిఇ) అధినాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, ఆయన సమ్మతితోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానని తమిళ జాతీయవాద నాయకుడు పళా నెడుమారన్ సోమవారం వెల్లడించారు. 2009లో శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశలో ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం హతమార్చింది. ప్రభాకరన్ మృతదేహాన్ని ఎల్‌టిటిఇ మాజీ నాయకుడు కరుణ అమ్మన్ కూడా అప్పట్లో గుర్తించారు. కాగా..ప్రభాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులు తనకు అందుబాటులో ఉన్నారని నెడుమారన్ ప్రకటించారు. అయితే..నెడుమారన్ వాదనను శ్రీలంక ప్రజలతోసహా ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు.

2009 మే 19న ఉత్తర శ్రీలంకలోని ముల్లివయకల్ అడవుల్లో ప్రభాకరన్ మృతదేహం ఫోటోలను శ్రీలంక సైన్యం మీడియాకు విడుదల చేసింది. ప్రభాకరన్ శ్రీలంక నుంచి పారిపోయాడన్న వదంతులు రాకుండా ఉండేందుకే ఆయన మృతదేహం ఫోటోలను శ్రీలంక సైన్యం ముందుజాగ్రత్తగా విడుదల చేసింది. ప్రభాకరన్‌కు ఒకప్పుడు కుడిభుజంగా వ్యవహరించి ఆ తర్వాత ఆయనతో విభేదించి వేరుపడిన కరుణ అమ్మన్‌తోనే ఆ ఫోటోలను శ్రీలంక సైన్యం ధ్రువీకరింపచేసింది. కరుణ అమ్మన్ అనంతర కాలంలో మహీంద్ర రాజపక్స ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News