Monday, January 6, 2025

కానిస్టేబుల్ ఉరి వేసుకోగా… బెడ్ పై భార్య మృతదేహం

- Advertisement -
- Advertisement -

లక్నో: కానిస్టేబుల్ ఉరివేసుకోగా భార్య మృతదేహం బెడ్‌పైడి ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అజయ్ సింగ్ అనే వ్యక్తి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. బిజ్‌నోర్ ప్రాంతంలో అజయ్ తన భార్య ప్రాచితో కలిసి ఉంటున్నాడు. రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిసిపి కేశవ్ కుమార్ తన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేశాడు.

భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా భార్య మృతదేహం బెడ్‌పై పడి ఉంది. మృతదేహాలపై ఎక్కడ రక్తపు మరకలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దంపతులు ఎప్పుడు కలిసి మెలిసి ఉండేవారని, వారి మధ్య గొడవలు లేవని పక్కింటి వారు తెలిపారు. వాళ్ల ఇంటికి బంధువులు ఎవరు రాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News