Tuesday, January 21, 2025

లక్నో కెప్టెన్‌గా పంత్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: రానున్న ఐపిఎల్ సీజన్‌లో పాల్గొనే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కెప్టెన్‌గా భారత వికెటక్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. గతం లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు సారథిగా వ్యవహరించాడు. మెగా వేలం పాటలో లక్నో ఫ్రాం చైజీ భారీ మొత్తాన్ని చెల్లించి పంత్‌ను సొంతం చేసుకుంది. తాజాగా అతనికి కీలకమైన సారథ్య బాధ్యతలను అప్పగించింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో లక్నో టీమ్ యజమాని సంజీవ్ గొయెంకా ఈ విషయాన్ని వెల్లడించారు. పంత్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నాడు. పంత్ సారథ్యం లక్నో మెరుగైన ప్రతిభను కనబరుస్తుందనే నమ్మకాన్ని గొయెంకా వ్యక్తం చేశారు. పంత్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని హామీ ఇచ్చాడు. కాగా, గత నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News