లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 20కి పైగా మందిని దగ్గరిలోని ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరు మహిళలు కాలిన గాయాలతో చనిపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అధికార ధృవీకరణ జరగాల్సి ఉంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి. రెస్కూ ఆపరేషన్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సీనియర్ అధికారులను ఆదేశించారు. బాధితులకు తగిన చికిత్స అందించాలని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా అగ్నిమాపక దళాలు హోటల్‌లో చిక్కుబడిపోయిన వారిని కాపాడేందుకు అద్దాలు పగులగొట్టారు. గదుల్లో పొగ కమ్ముకునేసరికి అనేక మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ 20 మంది చిక్కుకుని ఉన్నారు. సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను పిలిపించారు. అప్రమత్తంగా ఉన్నారు. హోటల్‌కు వెళ్లే దారికి ఇరుకుగా ఉండడం వల్ల సహాయక చర్యల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. అసలు అగ్ని ప్రమాదం ఎలా చోటుచేసుకుందో ఇప్పటి వరకైతే రూఢీ కాలేదు.