Sunday, December 22, 2024

రూ.1000 కోసం స్నేహితుడిని పొడిచి చంపారు….

- Advertisement -
- Advertisement -

 

లక్నో: 1000 రూపాయల కోసం స్నేహితుడిని ఇద్దరు యువకులు పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమ్టి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జుగౌలి ప్రాంతంలోని ఇందిరానగర్ ఆకాశ్ కశ్యప్ కుటుంబం నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అభయ్ ప్రతాప్ సింగ్, దేవాన్ష్ కుమార్‌తో ఆకాశ్ స్నేహంగా ఉండేవాడు. అవినాశ్ తివారితో కలిసి ఈ ముగ్గురు మద్యం తాగారు.

అభయ్ వద్ద ఆకాశ్ రూ.1000 అప్పుగా తీసుకొని ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆకాశ్‌పై అభయ్, ప్రతాప్ కర్రతో దాడి చేసి అనంతరం కత్తితో కడుపులో పలుమార్లు పొడిచారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. చుట్టు పక్కల వారు అతడిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకాశ్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: మూడు ముళ్లకు ముందే మురిపెం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News