ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్ జట్టుకు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 31 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. మార్‌క్రమ్ 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 53 పరుగులు సాధించాడు. ఆయూష్ బడోని (30), డేవిడ్ మిల్లర్ (27) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ ఐదు వికెట్లను పడగొట్టాడు. తర్వాత లక్షఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. సూర్యకుమార్ యాదవ్ (67), నమన్ ధీర్ (46) రాణించిన ఫలితం లేకుండా పోయింది.
ముంబై పై లక్నో విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -